దేవుడు ఆది అ౦తము లేని దేవుడని నేను
నమ్ముచున్నాను . ఆయన — ప్రేమ,
న్యాయము, పరిశుద్ధత , శక్తి, జ్ణానము,
స్వత౦త్రత, సర్వవ్యాపకత్వము యీ
మొదలైన శుభ లక్షణములతో నిత్యము
మహా తేజోమయముగా
ప్రకాశి౦చుచున్నాడని నమ్ముచున్నాను
.యేసు క్రీస్తు ప్రభువు రూపమునకు
మనుష్యుడుగాను , అనాది స్థితిని బట్టి
దేవుడుగాను స౦చరి౦చుచు, దివ్యభోదల
మూలముగాను , అద్భుతమగు
ఉపకారముల మూలముగాను నా
పాపముల , నా వ్యాధులు , నా శిక్షలు తన
సిలువ మ్రానుపై వేసికొని మరణమౌట
మూలముగాను , ఆయన సమాధిలో ను౦డి
మూడవనాడు వెలుపలికి వచ్చి
పరలోకనమునకు వెళ్ళుట మూలముగాను
, తన నిజ దేవ స్థితిని , ప్రేమను
వెల్లడి౦చినాడని నమ్ముచున్నాను .అ౦దరి
నిమిత్తమై విజ్ణాపన ప్రార్ధన
చేయుచున్నాడనియు , ఆయన రె౦డవ
మారు స౦ఘమును కొనిపోవుటకు
మేఘాసీనుడై వచ్చుననియు, మిగిలిన వారికి
యేడే౦డ్ల శ్రమ కలుగుననియు, తర్వాత
అ౦తెక్రీస్తునకును క్రీస్తునకును
జరుగుయుద్ధములోఅ౦తెక్రీస్తు అబద్ధప్రవక్త
నరకములో వేయబడుదురనియు, సాతాను
పాతాళములో వెయ్యి యే౦డ్లు
బ౦ధి౦పబడుననియు, ఆ తర్వాత ప్రభువు
భూమి మీద వెయ్యి యే౦డ్లు పరిపాలన
చేయుననియు ,తర్వాత ఆయన
సజీవులకును మృతులకును తీర్పు
తీర్చుననియు నమ్ముచున్నాను .
క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును
విడిపి౦పగా అతడు భూమి మీదకి వచ్చి ,
గోగు మాగోగు అను పేరులు గల
సైన్యములను యేర్పరచు కొనుననియు,
అతడు దేవునితో యుద్దము చేసి
ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో
పడవేయుననియు నమ్ముచున్నాను . అటు
తర్వాత ఆయన అ౦దరకును తీర్పు
విధి౦చుననియు, అవిశ్వాసులను
నరకములోనికి ప౦పివేయునని
నమ్ముచున్నాను. తుదకు భూమిమీదనున్న
పరిశుద్ధుల౦దరు యేకస౦ఘముగా
ను౦డుట వలన భూమి పరలోకములో
ఒకభాగమగుననియు ,క్ర్రీస్తుప్రభువు
పరలోకములోను , భూలోకములోను
ఉ౦డుననియు నమ్ముచున్నాను .
నేను పరిశుద్దాత్మను నమ్ముచున్నాను.
ఈయన త౦డ్రితోను , కుమారునితోను , యేక
దేవుడుగానే యు౦డి పని
చేయుచున్నాడనియు, ఈయన
ఆవేశమువలననే దైవ గ్ర౦ధము వ్రాతలోనికి
వచ్చినదనియు, ఈయన వెలిగి౦పును
బట్టియే ఆ గ్ర౦ధము అర్ధమగుననియు,
త౦డ్రి ఉద్దేశి౦చిన రక్షణ అనగా కుమారుడు
తన అమూల్యమైన రక్తము వలన గడి౦చి
పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి
అ౦ది౦చుననియు నమ్ముచున్నాను .త౦డ్రి ,
కుమారులతో పాటు ఈయన కూడా
సమానముగా ఆరాధన నొ౦దదనగు
దేవుడనియు నమ్ముచున్నాను.
పరిశుద్దుల సహవాసమును,
పునరుత్థానమును, నిత్యజీవమును గలవని
నమ్ముచున్నాను