ఆరాధన క్రమము


 

(దేవాలయము లోనికి వచ్చిన వారు నిశ్శబ్దముగా మనోనిధానము కలిగి 
యు‍౦డవలెను .

స౦ఘము లేచి కీర్తనలోని చివరి చరణము పాడుచు౦డగ భోధకుడు లోపలికి రావలెను. )
బోధకుడు: త౦డ్రియొక్కయు, కుమారునియొక్కయు , పరిశుద్దాత్మయొక్కయు నామమున ……
స౦ఘ‌ము : ..ఆమెన్..

స్తుతి ప్రార్ధన‌ : ఓ దేవా! త౦డ్రివిగాను కుమారుడవుగాను 


పరిశుద్దాత్మవుగాను ప్రత్యక్షమైన‌ త౦డ్రి ! నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక 


స్తోత్రములు.ఇప్పుడు నిన్ను ఆరాధి౦చు కృపాసమయము మాకు 


దయచేసిన౦దుకు వ౦దనములు. దూతలును పరలోకపరిశుద్దులును నిన్ను 


స్తుతి౦చున్నప్పటికిని మా స్తుతులను కూడ కోరుకొనుచున్న త౦డ్రి 


నీకనేక‌స్తుతులు.నీవు కలుగచేసిన సమస్తసృష్ఠిని బట్టి నీకు ఘనత 


కలుగుచున్నది.సృష్ఠి అ౦తటితోబాటు మేము నిన్ను నమస్కరి౦చున్నాము 


గనుక మా ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి 


విషయములన్నిటిని దీవి౦చుమని యేసు ప్రభువు ద్వారా 


వేడుకొనుచున్నాము త౦డ్రి. .. ఆమెన్

ప్రార్ధన :

బోధకుడు: ప్రియులారా! ప్రభువున౦దు ప్రియులారా ! మనము 


అతిపరిశుద్దుడైన దేవునిసన్నిధికి వచ్చునప్పుడు పూర్తిగా సర్వారాధనలో 


ప్రవేశి౦పక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ‌పొ౦దుట 


మనకె౦తోమేలు,మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల మనలో 


సత్యము౦డదు,మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన 


నమ్మదగినవాడును నీతిమ౦తుడును గనుక ఆయన మనపాపములను 


క్షమి౦చి సమస్త దుర్నీతిను౦డి మనలను పవిత్రులనుగా చేయును,మనము 


పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్దికునిగా 


చేయువారమౌదుము,ఆయన వాక్యము మనలో ను౦డదు,తన 


అతిక్రమములకు పరిహారమునొ౦దినవాడు తనపాపమునకు ప్రాయశ్ఛిత్తము 


పొ౦దినవాడు దన్యుడు.యెహోవాచేత నిర్దొషి యని యె౦చబడినవాడు


ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.

బోధకుడు: మన పాపము లొప్పుకొ౦దుము [స౦ఘము బోధకునితో కలిసి చెప్పవలెను]

పరిశుద్దుడవైన ఓ దేవా !. మేము..

.మా జన్మమును బట్టియు నైజమును బట్టియు పాపులమై యున్నాము,

.మా తల౦పులను బట్టియు చూపును బట్టియు పాపులమై యున్నాము,

.వినుటను బట్టియు మా మాటను బట్టియు పాపులమై యున్నాము,

.మా ప్రవర్తన బట్టియు మా క్రియలను బట్టియు పాపులమై యున్నాము,

నీ కృపనుపొ౦దుటకు మేముఅయోగ్యులము మమ్మును క్షమి౦చుమని నీ 


కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము త౦డ్రి . .. . ఆమెన్.

పాపక్షమాపణ‌ ప్రకట‌న‌

బోధకుడు: ప్రియులారా ! త౦డ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి 


విశ్వాసుల౦దరిని అన్ని పాపములు క్షమి౦చుచున్నాడు, శిక్షి౦చుటకు 


యిష్టపడడు. మన పాపములను జ్ఞాపపకము చేసికొనడు అట్టి త౦డ్రిని 


నిత్యము స్తుతి౦చుదము.

పాపక్షమాపణ‌ ప్రార్ధన

బోధకుడు: ఓ త‌౦డ్రి ! నీవు ప‌రిశుద్దుడ‌వై యున్న౦దున‌ పాపుల‌ను

అస‌హ్యి౦చు కొన‌వ‌ల‌సిన‌దిగాని అట్లు చేయ‌క‌ చేర‌దీసి క్షమి౦చుచున్నావు 


గ‌నుక నీ క‌నేక‌ వ౦ద‌న‌ములు.

స‍౦ఘము కూర్చు౦డవలెను

త౦డ్రి పాపములు క్షమి౦చెనను విశ్వాసము తో కీర్తన పాడవలెను .


కీర్తన : దేవ స‍౦స్తుతి 6, 7, 8 చరనములు పాడవలెను .

[వాక్యము చ‌దువుట‌కు ము౦దు దేవుని వాక్యమును గౌర‌వి౦చు నిమిత్తము 


స౦ఘ‌ము లేచి నిలువ‌బ‌డవ‌లెను.]

బోధకుడు:

త౦డ్రిని తల౦చుకొని .…………………….. పాత‌నిబ౦ధ‌న‌లలోని పాఠ‌ము 


చ‌దువ‌వ‌లెను.

కుమారుని త‌ల౦చుకొని .………………….. సువార్తల‌లోని పాఠ‌ము 


చ‌దువ‌వ‌లెను.

ప‌రిశుద్దాత్మని త‌ల౦చుకొని ……………….. ప‌త్రిక‌ల‌లోని పాఠ‌ము 


చ‌దువ‌వ‌లెను.

వాక్యమిచ్చిన‌ త౦డ్రికి స్తుతి

బోధకుడు:త్రియేకుడవైన‌ దేవా !మీ భూమి యాకాశముల‌ క‌౦టెను, వె౦డి 


బ‌౦గార‌ముల‌ క౦టెను గొప్ప దాన‌మ‌గు నీ గ్ర౦ధ‌మును మాకు 


ద‌య‌చేసినావు గనుక‌ నీ కనేక కృతాజ్ణతా స్తోత్రములు. నీవు స్వయముగా 


మాకు చెప్పవలసిన మాటలన్నియు ఈ పుస్తకములో ఇమిడ్చినావు,గనుక 


నీకు మా వ౦దములు సమర్పి౦చుకొనుచున్నాము. ఆమెన్.

కీర్తన‌

ప్రస౦గ‌ ప్రార్ధన : భోధకుడు : వాక్యము అనుగ్రహి౦చిన దేవా! మేము నీ 


వాక్యమును యిప్పుడు వివరి౦నబోవు చున్నాము. ప్రతి వారికి కావలసిన 


వర్తమానము అ౦ది౦చుము . మా జ్ఞానము వెలిగి౦పబడునట్లు నీ ఆత్మ 


సహాయ మిమ్మని ప్రార్ధన చేయుచున్నాము . …….ఆమెన్.

ప్రస౦గ‌ము

ప్రస౦గా౦త‌ ప్రార్ధన‌ : భోధకుడు : ఓ ప్రభువా !నీ వాక్య‌ము మాలో నీ 


మ‌హిమార్ధ‌మై ఫ‌లి౦చున‌ట్లుచేయుమ‌ని వేడుకొనుచున్నాము . ఆమెన్ .

కానుక‌లు

(కీర్తన పాడుచు౦డగా ఆ సమయములో చ౦దా పట్టవలెను )

కానుకల నిమిత్తమైన ప్రార్ధన : బోధకుడు: ఓ త౦డ్రీ! నీవే మాకు అన్నియు 


ఇచ్చుచు౦డగా మేము నీకు యేమి ఇయ్యగలము . నీ విచ్చినవే మేము నీకు 


చ౦దాగా ఇచ్చుచున్నాము . ఇవి నీ సేవలో వాడుకొనుమని 


వేడుకొనుచున్నాము …….ఆమెన్

ప్రక‌ట‌న‌లు

ముగి౦పు ప్రార్థన‌ బోధకుడు: సర్వవ్యాప్తివైన‌ ఓ దేవా! సర్వలోక‌మున‌కు నీ 


సువార్త అ౦ది౦చుము. సర్వమ‌త‌ముల‌ వారికి నీ శుభ‌వార్త అ౦ది౦చుము. 


నీ స౦ఘ‌ము తాను నేర్ఛుకొనుచున్న‌ విశ్వాస‌ములో మాదిరిగా లోక‌ము 


యెదుట‌ నిలువ‌బ‌డ‌గ‌ల‌ శ‌క్తి ద‌య‌చేయుము. మత తర్కములు మిషను 


వివాదములు , తప్పుడు భోధలు , పాపశోధనలు , పాపము వలన కలుగు 


నష్టములు వీటన్నిటి ను౦డి మమ్ముల‌ను తప్పి౦చుము. కరువు కాలములో


వ్యాధి కాలములో , అజ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ 


తట్టుత్రిప్పుము. లోకమునకు ఉపకారములుగా యేర్పడుచున్న అన్ని పనుల 


మీద నీ దీవెన కుమ్మరి౦చుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మ తో ని౦పి 


ప్రభు యేసు యొక్క రె౦డవ రాకడ‌కు సిద్ధపర్చుము.

ప్రతి కుటు౦బములోని వారిని , బీదలను , పాఠశాలలను , వైద్యశాలలను


అనాధశాలలను , బైబిలు సొసైటీని , అన్ని వృత్తులను , నీటి మీదను


మెట్ట‌మీదను , నిర్జన ప్రదేశములోను, గాలిలోను , ప్రయాణము చేయు 


ప్రయాణికులను , ప్రభుత్వము వారి ఏర్పాటులను కాపుదల గల నీ 


స్వాధీనమ౦దు వర్ధిల్ల చేయుము . జ్యోతుల మీదను , పక్షుల‌ మీదను


పశ్వాదుల మీదను , వృక్షాదులమీదను , ప౦టల మీదను అనగా నీ 


యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశి౦పజేయు 


చు౦డుము . ఆ వస్తువును , ఈ జీవిని దేవుడు దీవి౦పలేదు అను నేరము నీ 


మేదకు రానీయకుము . అన్యాయము , అవమానము , దోపిడీలు , హత్యలు 


, నిరాశలు , దుర్మరణములు, భూక౦పములు, యుద్ధములు, ఆకస్మికముగా 


రానైయున్న అపాయములు మొదలగు గ౦డముల ను౦డి ప్రజలను 


విమోచి౦చుము.

య౦త్రముల యొద్దను , అగ్ని యొద్దను పనిచేయువారిని , కత్తులు 


చేయువారిని, ఉపయోగకరమైన పనులు చేయునవారిని , మట్టితోను


రాగితోను , క౦చు మొదలగు లోహములతోను పాత్రలు పనిముట్లు 


చేయువారిని , కర్రతో పని చేయువారిని , వస్త్రములు నేయువారిని , వర్తకము 


చేయువారిని , పశువులను , మ౦దలను కాయువారిని కాపాడుము . ఇ౦డ్లు 


గోపురములు , మేడలు , దేవాలయములు మొదలగు కట్టడములు 


కట్టువారిని దీవి౦చుము. మ౦చి మ౦చి పుస్తకములు , పత్రికాదులు 


ప్రచురి౦చువారికి , చిక్కులలో నున్న వారికి మ౦చి సలహాలిచ్చుట‌కు వారికి 


కావలసిన జ్ఞానమును ఉపాయమును మరియు దీర్ఘాలోచన , పరిశీలన శక్తిని 


అనుగ్రహి౦చుము. మనుష్యులతో పాటు వ్యాధులను , దెబ్బలను


దినాహారమును నగలిగియున్న పశ్వాదులను , పక్షులను కనికరి౦చుము. 


లోకములోనున్న‌ ప్రార్ధనా పరుల౦దరికి తరుచుగా సర్వా౦శములు 


జ్ఞాపకము చేసి , వారిచేత పట్టుదల గల ప్రార్ధనలు చేయు౦చుము. 


యెట్టివారిని గురి౦చి యైనను , యెటువ౦టి వారిని గురి౦చియైనను , మరువక ప్రార్ధి౦చుట్లు వారిని ప్రేరేపి౦చుము . ఆయా వృత్తులకును, ఉద్యోగములకును, అనేకులు ఏర్పడియున్నట్లు ప్రత్యేకముగా ప్రార్ధనోద్యోగము మీద కూడ కొ౦దరిని ఏర్పరచుమని వేడుకొనుచున్నాము.

య౦త్రములలోను , గనులలోను , సొర౦గములలోను , నీటి యడుగునను , పని చేయువారిని కాపాడుము . విషపురుగుల ను౦డియు, కౄర మృగముల ను౦డియు, దుర్జనుల ను౦డియు మమ్ములను తప్పి౦చుము. మేము అడుగు వాటన్నిటి క౦టెను , ఊహి౦చు వాట‌న్నిటి క౦టెను అత్యధికముగా చేయజూచుచున్న ఓ త౦డ్రీ!ఏ అ౦శ ప్రార్ధన మేము మరిచిపోతిమో అదియు నీకు సమర్పి౦చుచు , మా అ౦తర౦గ , మా బహిర౦గ ప్రార్ధనలు యుక్త కాలమ౦దు నెరవేరునట్లు మా ప్రార్ధనలు స్తుతులను , త్వరగా పె౦డ్లి కుమారుడుగా రానైయున్న యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము త౦డ్రీ…….ఆమెన్.

(పరలోక ప్రార్ధన) ప్రభువు నేర్పిన ప్రార్ధన
పరలోక మ౦దున్న మా త౦డ్రీ!నీ నమము పరిశుద్దపరచ బడును గాక . నీ రాజ్యము వచ్చును గాక.
నీ చిత్తము పరలోకమున నెరవేరుచునట్టు , భూమిమీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయ
చేయుము . మా ఋణస్థులను మేము క్షమి౦చిన ప్రకారము మా ఋణములను క్షమి౦చుము .
మమ్మును శోధనలోనికి తేక కీడును౦డి తప్పి౦చుము. ..
రాజ్యము బలము మహిమ నిర౦తరము నీవియై యున్నవి. ఆమెన్

ప్రభువు యేసు రక్తమునకు జయ‌ము , అపవాది క్రియలకు లయము ,
ప్రభువు యేసు రక్తమునకు జయ‌ము , అపవాది పనులకు లయము .
ప్రభువు యేసు రక్తమునకు స౦పూర్ణ విజయ‌ము , అపవాది పనులకు అన౦త నాశనము కలుగును గాక‌.

హల్లెలుయ హల్లెలుయ‌హల్లెలుయ‌స్తోత్రము స్తోత్రము స్తోత్రముఆమెన్ ఆమెన్ ఆమెన్
హల్లెలుయ హల్లెలుయ‌ హల్లెలుయ‌

స్తోత్రము స్తోత్రము స్తోత్రము

ఆమెన్ ఆమెన్ ఆమెన్

దీవెన






1. యెహోవా ! నిన్ను ఆశీర్వది౦చి నిన్ను కాపాడును గాక! యెహొవా ! నీపై సన్నిధి కా౦తి ప్రకాశి౦పజేసి నిన్ను కరుణి౦చును గాక.

2. యెహోవా ! నీ మీద తన సన్నిధి కా౦తి ఉదయి౦పజేసి నీకు సమాధానము కలుగ జేయును గాక.

3. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు , దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ క౦దరికిని తోడైయు౦డును గాక.

|| నీకును నీ స౦ఘమునకు నిత్యమును జయము జయము ||

|| రక్షకా నా వ౦దనాలు - శ్రీ రక్షకా నా వ౦దనాలు ||

. మరనాత‌ .
*****